News July 31, 2024
HYD: రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం: BRS నేత

మహేశ్వరం MLA, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి బతుకు బస్టాండ్ అంటూ అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని BRS సీనియర్ నేత, ఆ పార్టీ మీర్పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరిచి మాట్లాడటం సరికాదన్నారు.
Similar News
News November 17, 2025
కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.