News July 14, 2024
HYD: రేపు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు.. హై టెన్షన్
నిరుద్యోగుల డిమాండ్‌ల సాధన కోసం రేపు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభలు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి పాల్గొని నిరసన తెలియజేయాలని బీసీ నాయకులు కోరారు. రేపటి కార్యక్రమానికి భారీ ఎత్తున సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేపటి సెక్రటేరియట్ ముట్టడి పిలుపుతో నగరంలో హైటెన్షన్ నెలకొంది.
Similar News
News October 8, 2024
HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్.. 3 లక్షల కేసులు: ఎసీపీ
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎసీపీ జి.శంకర్ రాజు అన్నారు. మలక్‌పేట్‌లోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు, నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 2024లో ఇప్పటి వరకు 3లక్షల కేసులయ్యాయన్నారు.
News October 8, 2024
HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్
HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.
News October 8, 2024
ఎన్కౌంటర్లకు నిరసనగా వచ్చే నెల భారీ ధర్నా: ప్రొఫెసర్
చత్తీస్‌గడ్‌లో ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లో వేదిక ప్రతినిధులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. మధ్య భారత దేశంలో గత 10 నెలలుగా కొనసాగుతున్న ఆదివాసి హత్యాకాండ మరింత తీవ్రమైందన్నారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నవంబర్ 3న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.