News August 12, 2024

HYD: రేవంత్‌ను అంటే బండి సంజయ్‌కు కోపమెందుకు?: రావుల

image

హామీల విషయంలో రేవంత్‌ను తమ పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే కాంగ్రెసోళ్లే పట్టించుకోరని, కానీ బండి సంజయ్‌కు కోపమెందుకు వస్తుందని BRS సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రశ్నించారు. KTRను జైల్లో పెట్టాలని బండి అంటున్నారని, పదేళ్లు KTRఐటీ మంత్రిగా ఉండి ఎంతో అభివృద్ధి చేశారన్నారు.బండిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌‌‌కు పంపించాలని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు నిధులు తేలేదన్నారు.

Similar News

News October 23, 2025

HYD: రేపు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు విడుదల: KTR

image

కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రూపొందించింది. శుక్రవారం కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి HYDలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని నిరుద్యోగ జేఏసీ ఈరోజు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలువురు నిరుద్యోగులు నామినేషన్లు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News October 23, 2025

HYD: ప్రజాపాలన వైపే ప్రజలు: మంత్రి సీతక్క

image

జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలన వైపే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ పరిధి బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్‌లో ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. BRS నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ పార్టీ తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి నవీన్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఉన్నారు.

News October 23, 2025

BIG BREAKING: బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. అరెస్ట్

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 12లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్‌ రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (వెస్ట్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు, సెలూన్ వ్యాపారి మహమ్మద్ షరీఫ్‌, కర్నూలుకు చెందిన ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.