News February 6, 2025

HYD: రేవంత్‌పై KTR ఫైర్

image

పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సచివాలయం ముందే మాజీసర్పంచ్‌లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు. కనికరం లేని ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పదవీకాలంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన మాజీ సర్పంచులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

Similar News

News February 6, 2025

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 195 నుంచి రూ. 206, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్‌ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

News February 6, 2025

HYD: ఫుడ్ ఆర్డర్.. బిర్యానీలో ఈగ

image

ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టిన కస్టమర్ షాకయ్యాడు. బాధితుడు రామకృష్ణ వివరాలు.. ‘చాదర్‌ఘాట్‌‌లోని ఓ హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాను. భోజనం తినే సమయంలో అందులో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేశాను. హోటల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇటువంటి హోటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అంటూ Way2Newsకు తెలిపారు.

News February 6, 2025

HYD: ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

image

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. జనవరి 1కి బదులు 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే, రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 17న ముగుస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

error: Content is protected !!