News February 6, 2025
HYD: రేవంత్‌పై KTR ఫైర్

పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సచివాలయం ముందే మాజీసర్పంచ్‌లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు. కనికరం లేని ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పదవీకాలంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన మాజీ సర్పంచులకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
Similar News
News March 25, 2025
HYD: ఓయూలో విధించిన ఆంక్షలపై వాయిదా తీర్మానం

ఓయూలో విధించిన ఆంక్షలపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యార్థుల ర్యాలీలు, ధర్నాల నిషేధంపై చర్చ కోరుతూ పార్టీ సభ్యులు అసెంబ్లీ కార్యదర్శికి వాయిదా తీర్మానం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం అందించారు.
News March 25, 2025
MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News March 25, 2025
రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రెడ్డిపల్లె, చుక్కాపూర్‌లో 37.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తోమ్మిదిరేకుల, ప్రొద్దుటూరు 37.3, మొయినాబాద్, మంగళ్‌పల్లి 37.2, కాసులాబాద్ 36.9, మొగలిగిద్ద 36.8, కేతిరెడ్డిపల్లి 36.7, కేశంపేట 36.6, ధర్మసాగర్, తుర్కయంజాల్, షాబాద్ 36.4, హస్తినాపురం, నాగోల్ 36.2, పేద్దషాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది.