News February 6, 2025
HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

కామారెడ్డి డిక్లరేషన్‌కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.
Similar News
News March 27, 2025
భారత్‌కు పుతిన్: పర్యటనను ఖరారు చేసిన రష్యా

ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనను రష్యా ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన త్వరలోనే ఇక్కడికి వస్తారని తెలిపింది. ‘భారత్‌లో పుతిన్ పర్యటనకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు’ అని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్‌రోవ్ ప్రకటించారు. టైమ్‌లైన్‌ను మాత్రం వెల్లడించలేదు. మోదీ మూడోసారి అధికారంలోకి రాగానే రష్యాకే వెళ్లిన సంగతి తెలిసిందే.
News March 27, 2025
విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు.
News March 27, 2025
LPG ట్యాంకర్ల సమ్మె.. AP, TGలపై ప్రభావం

చమురు కంపెనీలు తెచ్చిన కొత్త కాంట్రాక్ట్ నిబంధనలతో నేటి నుంచి LPG ట్యాంకర్ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీనివల్ల ట్యాంకర్లలో అదనపు డ్రైవర్/క్లీనర్ లేకుంటే రూ.20వేలు జరిమానా విధిస్తారు. దీంతో ఇవాళ్టి నుంచి 4వేల ట్యాంకర్లు నిరవధిక సమ్మెలో పాల్గొంటాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలలో గృహ, వాణిజ్య LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.