News June 17, 2024

HYD: రేవంత్ రెడ్డి లాగానే ఈటలకు జరుగుతుందా?

image

మల్కాజిగిరి MP స్థానం రాష్ట్ర స్థాయి నేతలకు కీలకంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి.. 2019లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచి ఆ తర్వాత T కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమయ్యారు. సేమ్ అలాగే 2023అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఓడిన ఈటల రాజేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచారు. ప్రస్తుతం T BJP స్టేట్ చీఫ్ నియామక రేసులో ముందు ఉన్నారు.

Similar News

News November 28, 2025

HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

image

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.

News November 28, 2025

HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.

News November 28, 2025

HYD: రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్

image

నకిలీ IPS శశికాంత్‌ను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు షేక్ పేటలోని అపర్ణ ఔరా అపార్ట్ మెంట్‌కు వెళ్లి తాళం తీసి వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్ రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచ్‌పై పడింది. వీడియోకు చిక్కకుండా వాచీని చేజిక్కించుకోగలిగినా మరో కానిస్టేబుల్ కంట పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువులు కాజేశాడు.