News December 16, 2024

HYD: రేషన్ కార్డుల పంపిణీపై MLC కోదండరాం సూచనలు

image

రేషన్ కార్డుల పంపిణీపై HYDలోని శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు కీలక అంశాలు ప్రస్తావించారు. ‘ఎప్పటిలోగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.. 2014 తర్వాత ఉప ఎన్నికలు జరిగిన చోట్ల మినహా, మిగతా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు.. కొత్త రేషన్ కార్డు జారీ చేయడంలో విధానాలు.. వద్వా కమిటీ సూచనలు.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Similar News

News December 10, 2025

HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

image

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్‌లైన్‌లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.

News December 10, 2025

HYD: CM సాబ్.. జర దేఖోనా!

image

నేడు CM రేవంత్‌ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్‌ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.