News April 2, 2024
HYD: రైతుల రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరం: KTR

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది KCR, మాయ మాటలు చెప్పి గెలిచింది రేవంత్ రెడ్డి అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. శామీర్‌పేట్‌లో MLA మల్లారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్.. ఎన్నికల్లో చెప్పారని ఏప్రిల్ వచ్చినా రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరమన్నారు. BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, సుదర్శన్ ఉన్నారు.
Similar News
News April 17, 2025
OU: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News April 17, 2025
21 నుంచి MBA ఇంటర్నల్ పరీక్షలు

ఓయూ పరిధిలో MBA ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదిన నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ తెలిపారు. MBA నాలుగో సెమిస్టర్ రెండో ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.
News April 17, 2025
బషీర్‌బాగ్: ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్

బషీర్‌బాగ్‌లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.