News January 20, 2025
HYD: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ

రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేసింది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో కమిటీ వేశారు. 2 వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయరంగ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2 వారాల అధ్యయనం తర్వాత నివేదిక రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.
Similar News
News December 10, 2025
ఇండి‘గోల’: ఈ రోజు 77 విమానాలు రద్దు

ఇండిగో విమానాల రద్దు పరంపర పర్వం కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు(బుధవారం) 77 విమానాలు రద్దయ్యాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే 37 ఇండిగోవిమానాలు.. రావాల్సిన 40 విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికులందరికీ ముందుగానే ‘విమానాల రద్దు’ సమాచారం ఇచ్చామని తెలిపారు.
News December 10, 2025
HYD: CM సాబ్.. జర దేఖోనా!

నేడు CM రేవంత్ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.


