News March 28, 2024
HYD: రైల్వే స్టేషన్లో టికెట్ బుకింగ్ చాలా ఈజీ..!
HYD, RR, MDCL,VKB జిల్లాల రైల్వే ప్రయాణికులకు SCR గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్, HYD, బేగంపేట, లింగంపల్లి, హైటెక్ సిటీ, వికారాబాద్ స్టేషన్లలో QR కోడ్ ద్వారా టికెట్‌కు నగదు చెల్లింపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. బోర్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.
Similar News
News January 11, 2025
HYD: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. నేటి నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. దీంతో పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. మియాపూర్, రాయదుర్గం, అమీర్ పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
News January 11, 2025
HYD: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాన్ని ఎగరవేయనున్నారు.
News January 11, 2025
శంషాబాద్: ప్రయాణికులు 2,3 గంటల ముందే చేరుకోవాలి
శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే దేశీయ,అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి 2,3 గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని సకాలంలో విమానాశ్రయానికి చేరుకోవాలన్నారు. తనిఖీల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా డీజీ యంత్రం సేవలను వినియోగించుకోవాలన్నారు.