News July 4, 2024

HYD: రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్ వద్ద అదనంగా వసూలు

image

HYD నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద క్లాక్ రూమ్‌లో వసూళ్లపై SCR ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదులు చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తి నుంచి క్లాక్ రూమ్ వద్ద ఒక బ్యాగుకి 24 గంటలకి రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.40 వసూలు చేశారని, ఇలా వందలాది మంది నుంచి అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిల్ కండిషన్లలోనూ 24 గంటలకు రూ.20 వసూలు చేయాలని ఉందని చూపించారు.

Similar News

News December 22, 2024

HYD: ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫ్రీ..!

image

హైదరాబాద్‌లో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు విధానం అమలవుతోంది. జిల్లాలో దాదాపు 130 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని రవాణా శాఖ తెలిపింది. రూ.25 లక్షలపై మినహాయింపు లభించినట్లుగా HYD జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్ వివరాలను వెల్లడించారు.

News December 21, 2024

HYD మెట్రో ఫేజ్ 2‌పై కీలక అప్‌డేట్

image

హైదరాబాద్ మెట్రో రైల్ భూసేకరణను అధికారులు వేగవంతం చేశారు. ఫేజ్-2, కారిడార్ VI- MGBS నుంచి చంద్రాయణగుట్ట వరకు 800 ఆస్తుల భూసేకరణ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. చదరపు గజానికి రూ.81,000 చొప్పున నష్టపరిహారం కట్టించేందుకు సిద్ధం అయ్యింది. సమ్మతించిన ఇంటి యజమానులకు పది రోజుల్లో నష్టపరిహారాన్ని అధికారులు ఇవ్వనున్నారు.

News December 21, 2024

HYD: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ చికిత్సకు స్పందిస్తున్నాడు. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండగా.. అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. నాడీ వ్యవస్థ ప్రస్తుతానికి స్థిరంగా పనిచేస్తుందని.. నిన్నటి కంటే ఈరోజు శ్రీతేజ ఆరోగ్యం మెరుగైందని శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.