News March 26, 2025
HYD: రైళ్లలో హై అలర్ట్.. ఎక్కడికక్కడ పోలీసులు!

MMTS రైలులో జరిగిన ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ అప్రమత్తమైంది. HYD, సికింద్రాబాద్ సహా SCR పరిధిలో నడిచే అన్ని రైళ్లలో ఎక్కడికక్కడ పోలీసుల తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల భద్రతపై ఫోకస్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
Similar News
News April 2, 2025
నంద్యాల: క్రీడకారులకు ఆరు వారాల సర్టిఫికెట్ కోర్స్

ఏపీ ప్రభుత్వ రాష్ట్ర క్రీడా అధికార సంస్థ ఆదేశాల మేరకు మే 6 నుంచి జూలై 2 వరకు ఆరు వారాల certificate course- 2025 నిర్వహిస్తున్నట్లు బుధవారం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం ఎన్ వి రాజు తెలిపారు. ఈ కోర్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.6wcc.nsnis.in వెబ్సైట్ ద్వారా ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News April 2, 2025
వికారాబాద్: సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన స్పీకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పాత గంజిలో డీలర్ గోపాల్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ నాయక్, ఆర్డిఓ వాసు చంద్ర, మున్సిపల్ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ, తహశీల్దార్ పాల్గొన్నారు.
News April 2, 2025
కోర్టు సినిమా హీరోను అభినందించిన ఎమ్మెల్యే

భద్రాచలం విచ్చేసిన కోర్టు మూవీ హీరో రోషన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి కోర్టు మూవీ ద్వారా పెద్ద హిట్ కొట్టినందుకు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం పట్టణాన్ని పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.