News March 4, 2025
HYD: రోజుకు నలుగురు మృతి.. ఇదీ పరిస్థితి..!

HYD మహా నగరంలో 24 గంటలకు నలుగురు మరణిస్తున్నారు. గతేడాది HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 1,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8,000 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో బైకర్స్ అధికంగా మృత్యువాతపడ్డారు. అందులోనూ మద్యం తాగి మృత్యువాత పడ్డవారే. మద్యం తాగి బండ్లు నడపొద్దని పోలీసులు నిత్యం క్యాంపెయిన్ నిర్వహిస్తూనే ఉంటారు. గతేడాది 22 లక్షల చలాన్లు జారీ కాగా.. రూ.111 కోట్లు జరిమానా విధించారు.
Similar News
News November 25, 2025
HYD: బాక్సు ట్రాన్స్ఫార్మర్లతో బేఫికర్!

‘చుట్టూ కంచె లేని ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్లు.. పట్టించుకోని పాలకులు’.. తరచూ TGSPDCLకి మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులు. గ్రేటర్లో ఈ సమస్యకు చెక్ పెట్టేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేలా కాంపాక్ట్ సబ్స్టేషన్లు, బాక్సు టైప్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, మిగతా ఏరియాలకు విస్తరించనున్నారు.
News November 25, 2025
జనగామ: డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఏంటి.?

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాటిని పంచకపోవడం, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పేద కుటుంబాలకు వాటిని పంచి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 25, 2025
ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.


