News March 29, 2025

HYD : రోజుకు 9వేల ట్యాంకర్ల బుకింగ్

image

నగరంలో నీటి ఎద్దడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక ఉగాది, రంజాన్ పండగలు రావడంతో నీటి వినియోగం కొంచెం ఎక్కువైంది. ఈ క్రమంలో జలమండలి ట్యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు సగటున 9 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని, వాటిని 24 గంటల్లోపే సరఫరా పంపుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటిని సాధ్యమైనంత పొదుపుగా వాడుకోవాలని అధికారులు నగర వాసులకు సూచిస్తున్నారు.24గం.హోమ్ డెలివరీ HYDలో భారీగా బుకింగ్స్

Similar News

News October 15, 2025

బల్కంపేట ఎల్లమ్మ గుడి సిబ్బందికి వాకీటాకీలు

image

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు సమాచారం అందించుకోవడానికి ఇబ్బందులెదురయ్యేవి. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేయవచ్చు. దీంతో భక్తుల ఇక్కట్లకు ఫుల్‌స్టాప్ పడనుంది.

News October 15, 2025

మేడ్చల్, రంగారెడ్డిని సపరేట్ చేసేదే మూసీ

image

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ఉద్భవించిన మూసీ ప్రతాపసింగారం గుండా పరుగులు పెడుతోంది. ఇక్కడి భౌగోళిక ప్రత్యేకతలో ఈ నది విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. తూర్పు, దక్షిణం దిశలుగా ముచుకుందా(మూసీ) ప్రవహిస్తోంది. సుమారు 4.5 కి.మీ. పొడవున తీరరేఖను ఏర్పరుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దుగా ఈ నది ఉంది. నల్లగొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తోంది.

News October 15, 2025

HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.