News April 12, 2024

HYD: రోజురోజుకి నగరంలో పెరుగుతున్న కాలుష్యం

image

HYD నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. నగరంలో నమోదవుతున్న కాలుష్య స్థాయిల్లో సింహభాగం రవాణా విభాగం నుంచే ఉంటోందనేది పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం పీఎం 2.5 ఘనపు మీటరు గాలిలో 40 మైక్రోగ్రాములకు మించొద్దు. సనత్ నగర్, ఇక్రిశాట్, జూపార్కు, పాశమైలారం ప్రాంతాల్లో అంతకు మించి నమోదైనట్టు పీసీబీ నివేదికలు వెల్లడించాయి.

Similar News

News September 23, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్ గుర్తిస్తే కాల్ చేయండి: MD

image

అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. HYD నగరంలో ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగించినట్లు గుర్తిస్తే విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు.

News September 23, 2024

చేవెళ్ల: రూ.38 కోట్లు విడుదల: ఎంపీ

image

స్వదేశీ అభియాన్ పథకం కింద రూ.99 కోట్లతో వికారాబాద్ అనంతగిరి కొండలను అభివృద్ది చేస్తామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దీనిలో మొదటి దశలో రూ.38 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. శంకర్పల్లి, మర్పల్లి రోడ్లు దెబ్బతిన్నాయని, రూ.400 కోట్లు నిధులు మంజూరు చేయాలని మంత్రి నితిన్ గడ్కరీని అడుగుతానని తెలియజేశారు.

News September 23, 2024

గ్రేటర్ HYDలో RTC బస్‌పాస్ REPORT

image

2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్‌ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.