News August 14, 2024
HYD: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండు వినియోగం రాబోయే 8ఏళ్లలో భారీగా పెరుగుతాయని కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ ) అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రోజువారీ నమోదైన 15,701 మెగావాట్ల గరిష్ఠ డిమాండుకు ఏటా 5.5 నుంచి 7.6% చొప్పున అదనంగా పెరుగుతుందని తెలిపింది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ గరిష్ఠ విద్యుత్ డిమాండు 15,704 మెగావాట్లు ఉండగా.. 2031-32లో 27,050 మెగావాట్లకు చేరుతుందని అంచనా.
Similar News
News September 10, 2024
షిర్డీ సాయినాథుడి సేవలో స్పీకర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షిర్డీ సాయినాథుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు స్పీకర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం హారతి సమయంలో మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్‌తో కలిసి సాయినాథుడిని మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
News September 10, 2024
HYD: టీవీవీపీ ఆస్పత్రుల్లోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
News September 10, 2024
HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన
HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.