News December 19, 2024

HYD: రోడ్‌కు రతన్ టాటా పేరు

image

HYD శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలో ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన రోడ్డుకు రతన్ టాటా మార్గ్‌గా నామకరణం చేస్తూ తీర్మానించారు. భారతదేశానికి అనేక విధాలుగా సేవలందించి 2024 అక్టోబర్ 9న స్వర్గస్తులైన పారిశ్రామికవేత్త సేవలకు గుర్తింపుగా రోడ్డుకు టాటా పేరును పెట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని గతంలోనే స్పష్టం చేశారు.

Similar News

News December 5, 2025

OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.

News December 5, 2025

గచ్చిబౌలి శాంతిసరోవర్‌లో ‘సండే ఈవినింగ్‌ టాక్‌’

image

బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌ క్యాంపస్‌లో ఆదివారం ‘సండే ఈవినింగ్‌ టాక్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సా.6:30 నుంచి రాత్రి 8 గం. వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్‌మెంట్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన, ధ్యాన అనుభవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.