News December 19, 2024
HYD: రోడ్‌కు రతన్ టాటా పేరు
HYD శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలో ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన రోడ్డుకు రతన్ టాటా మార్గ్‌గా నామకరణం చేస్తూ తీర్మానించారు. భారతదేశానికి అనేక విధాలుగా సేవలందించి 2024 అక్టోబర్ 9న స్వర్గస్తులైన పారిశ్రామికవేత్త సేవలకు గుర్తింపుగా రోడ్డుకు టాటా పేరును పెట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని గతంలోనే స్పష్టం చేశారు.
Similar News
News January 26, 2025
HYD: ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: కలెక్టర్ అనుదీప్
అనుమతులు లేని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రులను నడిపించే వ్యక్తులు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆఫీస్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
News January 26, 2025
ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News January 26, 2025
సికింద్రాబాద్: 76వ గణతంత్ర దినోత్సవం.. ముస్తాబైన రైలు నిలయం
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సుందరంగా వెలిగిపోయింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైలు నిలయం ముస్తాబైంది. హైదరాబాద్ డివిజనల్ కార్యాలయం మూడు రంగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మూడు రంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. అటు రైల్వే నిలయం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్ మూడు రంగులతో ముస్తాబైంది.