News April 19, 2024
HYD: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
బైకును కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. సరూర్ నగర్ PSలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనుంజయ్ కుటుంబసభ్యులతో కలిసి బైకుపై ఘట్‌కేసర్‌లో ఓ ఫంక్షన్‌కి గురువారం వెళ్లారు. నేడు ఉదయం ఉప్పల్‌లోని తన నివాసానికి భార్య, పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ వద్ద కారు వారి బైకును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందగా.. భార్య, పిల్లలకు గాయాలయ్యాయి.
Similar News
News September 8, 2024
HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయో గదిలో బంధించాడు
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
News September 8, 2024
HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ
హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.
News September 8, 2024
ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్
రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.