News July 6, 2024
HYD: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

హైదరాబాద్ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్‌పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
HYD- మేడారం జాతరకు ఈజీగా వెళ్లొచ్చు!

HYD నుంచి ములుగు జిల్లాలో ఆసియాలోనే జరిగే అతిపెద్ద గిరిజనుల జాతరకు వెళ్లాలని ఉందా? ఉప్పల్ నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఉప్పల్- వరంగల్, హనుమకొండ అక్కడి నుంచి డైరెక్ట్‌గా మేడారం వెళ్లడానికి బస్సులు అందుబాటులో ఉన్నట్లు RTC అధికారులు తెలిపారు. వ్యక్తిగత వాహనాల్లో వెళ్తే WGL నుంచి పస్ర, అక్కడి నుంచి నార్లపూర్, మేడారం వెళ్లాలి. RTC బస్సులు గద్దెల సమీపానికి వెళ్తాయి.
News January 7, 2026
HYD: లవ్ ఫెయిల్.. యువ డాక్టర్ బలి!

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న HYD అల్వాల్‌కు చెందిన ప్రణయ్‌కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌పై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News January 7, 2026
HYD: మాంజా కనిపిస్తే కాల్ చేయండి

TGFD, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సింథటిక్, గాజు పూత ఉన్న మాంజాపై నిషేధం విధించింది. HYDలో స్పెషల్ డ్రైవ్ సాగుతోంది. ప్రజలకు మాంజా కనిపిస్తే వెంటనే 1800 4255364, 040- 23231440కు కాల్ చేయాలని కోరింది. మాంజా విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 51 ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు చేపడతామని HYD TGFD ట్వీట్ చేసింది.
# SHARE IT


