News August 18, 2024
HYD: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి (అప్డేట్)

హైదరాబాద్ శివారు పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం తుఫాన్ వాహనాన్ని మరో కారు ఢీ కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దీక్షిత (13) మృతి చెందింది. మరో ఇద్దరు (అర్చన, కీర్తి) పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News October 25, 2025
HYD: BRSతోనే మరింత అభివృద్ధి సాధ్యం: MLA

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచార వేడి రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మాజీ మంత్రులు మల్లారెడ్డి, దయాకర్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి వెంగళ్రావునగర్ డివిజన్ పరిధి మధురానగర్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అపార్ట్మెంట్ వాసులతో MLA ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. BRSతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
News October 25, 2025
నా ఫొటో, పేరు చూసి మోసపోవద్దు: CP సజ్జనార్

సైబర్ క్రైమ్ మోసాలపై CP సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘వాట్సాప్లో DPగా నా ఫొటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు.’ అని ఆయన ట్వీట్ చేశారు.
SHARE IT
News October 25, 2025
HYD: ఒక్క రోజులో 8 కేసులు.. రూ.2.55 కోట్లు కొట్టేశాడు..!

పెట్టిన పెట్టుబడికి ఏడాదిలో 500 శాతం లాభం ఇస్తానని ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా 58 ఏళ్ల వ్యక్తిని సైబర్ నేరగాడు నమ్మించాడు. అనంతరం తన డిజిటల్ ఖాతాలో రూ.1.92 కోట్లు కనిపించడంతో సంతోషించిన బాధితుడు.. అతడు చెప్పినట్లు రూ.75 లక్షలను పెట్టాడు. ఎంతకీ విత్డ్రా కాకపోవడంతో మోసపోయానని బాధితుడు సైబర్ క్రైమ్ PSలో ఫిర్యాదు చేశాడు. కాగా సదరు సైబర్ నేరగాడు ఇలా ఒక్క రోజులోనే 8కేసుల్లో రూ.2.55కోట్లు కొట్టేశాడు.


