News September 3, 2024

HYD: రోడ్లన్నీ గోతులే.. రోజుకు వేలల్లో ఫిర్యాదులు

image

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

Similar News

News September 18, 2024

HYDలో పెద్ద ఆఫీసులకు డిమాండ్

image

విశాలమైన ఆఫీసులకు హైదరాబాద్‌లో భారీ డిమాండ్ ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. లక్ష చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో ఉన్న వాటిని లార్జ్ ఫార్మాట్ ఆఫీసులు అంటారు. ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో (హెచ్1) 3.08 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీల జాగా అమ్ముడైంది. గతేడాది మొదటి ఆర్నెళ్లలో 1.47 మిలియన్ చదరపు అడుగులు ఉంది, లావాదేవీలలో 61% వాటా ఈ సెగ్మెంట్‌లో ఉంది.

News September 18, 2024

HYD: మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై ఎంక్వైరీ?

image

మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై సర్కారు సీరియస్ ఉన్నట్లు తెలుస్తోంది. డీమ్డ్ హోదా సీట్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్లగా భర్తీ చేస్తున్నారని విద్యర్థులు, పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కాగా వైద్య కళాశాల నేషనల్ మెడికల్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి అనుబంధమైన హాస్పిటల్స్ అంశంపై ఆ శాఖ మంత్రి నేడు ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.

News September 18, 2024

HYD: రాత్రంతా ఆగని శానిటేషన్!

image

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలోను శానిటేషన్ పనులు కొనసాగాయి. అర్ధరాత్రిలో విధులు నిర్వహించిన బృందాలను కమిషనర్ ఆమ్రపాలి కాటా ప్రత్యేకంగా అభినందించారు. సరూర్‌నగర్ ప్రాంతాల్లో నిమజ్జనాలు సజావుగా సాగినట్లుగా సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ సుజాత పేర్కొన్నారు.