News January 13, 2025
HYD: రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల రయ్ రయ్..!

హైదరాబాద్లోని ఉప్పల్, KPHB, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, JBS, MGBS నుంచి హనుమకొండ, వరంగల్, తొర్రూరు, కరీంనగర్, సిద్దిపేట వెళ్లే రోడ్డు మార్గంలో RTC ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ మంటూ.. తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో 3,200 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం క్రితమే నూతన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు.
Similar News
News November 28, 2025
కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.
News November 28, 2025
HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.
News November 28, 2025
HYD: మంచినీరు వృథా చేస్తే.. కాల్ చేయండి!

HYDలో జలమండలి సరఫరా చేసే మంచినీటిని కార్లు, బైకులు కడగటానికి, రోడ్లు కడగటానికి ఉపయోగించడం, మోటార్లు పెట్టి నిర్మిస్తున్న ఇళ్లకు క్యూరింగ్ చేయడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించి భారీ జరిమానా వేస్తామని జలమండలి హెచ్చరించింది. ఎవరైనా చూస్తే వెంటనే ఫొటో తీసి, 155313, HMWSSB యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.


