News May 22, 2024
HYD: రోడ్లపై పేరుకుపోయిన ఇసుక మేటలు

ఇటీవలే కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఇసుక కొట్టుకురావడంతో అవి కట్టగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి. అంతేకాకుండా దుమ్ము, ధూళితో అసౌకర్యంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ఒకానొక సందర్భంలో స్కిడ్ అయి పడిపోతున్నామని అంటున్నారు. ఇసుక మేటలను తొలగించాలని కోరుతున్నారు.
Similar News
News November 2, 2025
BREAKING: HYD: నవీన్ యాదవ్పై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.
News November 2, 2025
HYD: TRPలో చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)లో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఈరోజు చేరారు. అడ్డగుట్ట మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు TRPలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి భావన రఘు సమక్షంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధత, అంకితభావంతో కృషి చేయాలని మల్లన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
News November 2, 2025
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 46% పనులు పూర్తి: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ.714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ‘X’ వేదికగా వెల్లడించారు.


