News July 29, 2024
HYD: రోడ్లపై వెళ్లేవారిని అడ్రస్ అడిగి.. చైన్‌స్నాచింగ్

గ్రేటర్ HYDలో చైన్ స్నాచర్లు విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లేవారికి ఓ చీటీ చూపి అడ్రస్ అడుగుతున్నారు. వారు చెప్పేలోపే గోల్డ్ చైన్ కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా పటాన్చెరు పరిధి అమీన్పూర్ వాసి అశ్విని గొలుసును దుండగులు ఇలాగే కొట్టేశారు. జర జాగ్రత్త!
SHARE IT
Similar News
News December 10, 2025
HYD: CM సాబ్.. జర దేఖోనా!

నేడు CM రేవంత్ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 10, 2025
నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
News December 10, 2025
HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్లైన్లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.


