News July 29, 2024
HYD: రోడ్లపై వెళ్లేవారిని అడ్రస్ అడిగి.. చైన్‌స్నాచింగ్

గ్రేటర్ HYDలో చైన్ స్నాచర్లు విరుచుకుపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళ్లే వారిని టార్గెట్ చేస్తున్నారు. బైక్‌లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లేవారికి ఓ చీటీ చూపి అడ్రస్ అడుగుతున్నారు. వారు చెప్పేలోపే గోల్డ్ చైన్ కొట్టేసి పరారవుతున్నారు. తాజాగా పటాన్చెరు పరిధి అమీన్పూర్ వాసి అశ్విని గొలుసును దుండగులు ఇలాగే కొట్టేశారు. జర జాగ్రత్త! SHARE IT
Similar News
News November 22, 2025
మైలార్‌దేవ్‌పల్లిలో గుండెపోటుతో విద్యార్థి మృతి

గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం మైలార్‌దేవ్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బాబుల్‌రెడ్డినగర్‌లో అభయ్ అనే విద్యార్థి ఆడుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో బాబుల్‌రెడ్డినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 21, 2025
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
News November 20, 2025
‘ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు’

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం SC బాయ్స్ హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ అందిస్తోన్న అన్నం సరిగా ఉడకకపోవడం, గింజలు గట్టిగా ఉండటం, రుచి తగ్గిపోవడం, కొన్నిసార్లు తినడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇదొక చిన్న సమస్యగా కాకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశమని, కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు.


