News February 1, 2025
HYD: రోల్ మోడల్‌గా తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సర్వేలో తెలంగాణ అనేక అంశాల్లో ఆదర్శంగా నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి తెలంగాణ ఘనతను చాటింది. అనేక పథకాల అమలు, వినూత్న పథకాల అమలులో ముందుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
Similar News
News February 19, 2025
HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.
News February 18, 2025
HYD: వాదిస్తూ.. కుప్పకూలిన సీనియర్ లాయర్

హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటు వచ్చింది. హైకోర్టులో వాదిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టులో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపేశారు. అన్ని కోర్టులో విచారణలు రేపటికి వాయిదా వేశారు.
News February 18, 2025
HYD: ఫేక్ న్యూస్ ప్రధానమైన ముప్పు: సీఎం

తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. HYDలోని హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ -2025 కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కొనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును సీఎం ప్రారంభించారు.