News December 6, 2024
HYD: ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’
HYD, RR, MDCL,VKB జిల్లాలలో పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి ఇటీవలే పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో అవినీతిని నిర్మూలించేందుకు అధికారులు మరో ముందడుగు వేసి ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డిలో అవగాహన కల్పిస్తున్నారు. ACB పోస్టర్ ఆవిష్కరించిన అధికారులు, ‘లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి’ అని పిలుపునిచ్చారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.
Similar News
News December 27, 2024
HYD: ‘ఈ ఫ్లై ఓవర్ ఓపెన్ చేయండి!’
ఆరాంఘర్ నుంచి నెహ్రూ జూ పార్క్ రూట్లో ఏకంగా 4.04 కిలో మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ నిర్మించారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇటీవల CM రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వాహనాలకు అనుమతి ఇవ్వనట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఈ ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని @serish ట్వీట్ చేశారు. అధికారికంగా ప్రారంభోత్సవం జరిగినా.. తుది మెరుగుల కారణంగా బారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
News December 27, 2024
నాంపల్లి ఎగ్జిబిషన్ 2025 విశేషాలు
జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్‌లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్ల ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎంట్రీ ఫీజ్ రూ.50 (గతేడాది రూ.40)గా నిర్ణయించారు.
News December 27, 2024
HYD: మలేషియాలో తెలుగు కోర్సులు: నిత్యానందరావు
నాంపల్లిలో మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషలో డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నామని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వైస్ ఛైర్మన్ నిత్యానందరావు తెలిపారు. తెలుగు భాష ఉనికి పోతే తెలుగు జాతి ఆస్తిత్వం కోల్పోతుందన్నారు. ఇది మలేషియాలో స్థిరపడ్డ తెలుగు జాతికి ఎంతో ఉపయోగమన్నారు. మలేషియా తెలుగు సంఘం ప్రతినిధులు వెంకట ప్రతాప్, సత్తయ్య, సుధాకర్ పాల్గొన్నారు.