News March 30, 2024

HYD: లంచం తీసుకుంటూ దొరికిన SI

image

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ACB అధికారులు సోదాలు జరిపారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా SI సైదులుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ స్థలం విషయంలో సుభాశ్ అనే వ్యక్తిని ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం ACB రైడ్స్ చేసింది. ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 12, 2026

HYDలో డెంగీ కేసులు.. అసలు నిజం ఇదే!

image

కేంద్ర ప్రభుత్వ సంస్థ NCVBDC డేటా ప్రకారం TGలో 2021లో కేవలం 220గా ఉన్న అనుమానిత చికెన్ గున్యా కేసులు 2024 నాటికి 13,592కు చేరుకున్నాయి. GHMC జనవరి 2026లో డెంగీ కేసులు 30% తగ్గాయని ప్రకటించింది. ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన డేటా మాత్రమే. ఎక్కువ మంది ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లడం, IHIP పోర్టల్‌లో డేటా నమోదులో జాప్యం వల్ల అసలు సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

News February 12, 2026

మల్కాజిగిరి కార్పొరేషన్: తూర్పు కోటలో రియల్ ఎస్టేట్ జాతర!

image

తూర్పు సిటీకి ఇప్పుడు ‘అదృష్టం’ పట్టింది. ​తార్నాక హుడా కాంప్లెక్స్ కేంద్రంగా మల్కాజిగిరి కార్పొరేషన్ తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు దుబాయ్ రేంజ్ స్కై స్క్రాపర్లు కట్టేందుకు గవర్నమెంట్ రూట్ మ్యాప్ రెడీ చేసింది ప్రభుత్వం. ఆఫీసియల్ సమాచారం ప్రకారం, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు సెట్ చేసి పశ్చిమ నగరానికే సవాల్ విసరబోతున్నారు.

News February 12, 2026

ఓహో.. ‘బేగంపేట’కు ఆ పేరు ఇలా వచ్చిందా?

image

బేగంపేటకు ఉన్న చారిత్రక నేపథ్యం నిజాం కాలానికి చెందింది. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ తన కుమార్తె బషీర్ ఉన్నిసా బేగంకు ఉమ్రన్ అమిర్‌తో వివాహం చేశారు. ఆ సందర్భంగా కట్నంగా ఒక విలువైన స్థలాన్ని ఆమెకు దానం చేశారు. ఆ భూమి బషీర్ ఉన్నిసా బేగం పేరిట నమోదు కావడంతోనే కాలక్రమేణా ఆ ప్రాంతం ‘బేగంపేట’గా ప్రసిద్ధి చెందింది. నిజాం రాజవంశ వైభవానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.