News November 7, 2024

HYD: లక్షల్లో భవనాలు.. పదుల్లో ఫైర్ స్టేషన్లు..!

image

గ్రేటర్ HYDలో లక్షకు పైగా ఐదంతస్తుల కంటే ఎత్తు కలిగిన భవనాలు ఉన్నాయి. HYD, RR, MDCL జిల్లాల్లో చూస్తే అగ్నిమాపక కేంద్రాలు కేవలం 31 మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా సరైన సమయానికి అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాల స్థాయి పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 23, 2024

రేపు ఓయూలో ప్రవేశ పరీక్ష

image

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయం ప్రాంగణంలోని డిస్టెన్స్‌ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ ఎంబీఏ (ఈవెనింగ్) 2 ఏళ్ల కోర్సు ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News November 22, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మాసిస్టులు బాధ్యతతో పని చేయాలి: రాజనర్సింహ 

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సచివాలయంలో సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మందుల కొరత పై చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. హెల్త్ ఫెసిలిటీ పనితీరుపై సమీక్షలో చర్చించారు.

News November 22, 2024

HYD: ముగిసిన రాష్ట్రపతి పర్యటన

image

HYD మాదాపూర్‌లోని శిల్పారామం వేదికగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు వీడ్కోలు పలికారు.