News November 7, 2024
HYD: లక్షల్లో భవనాలు.. పదుల్లో ఫైర్ స్టేషన్లు..!
గ్రేటర్ HYDలో లక్షకు పైగా ఐదంతస్తుల కంటే ఎత్తు కలిగిన భవనాలు ఉన్నాయి. HYD, RR, MDCL జిల్లాల్లో చూస్తే అగ్నిమాపక కేంద్రాలు కేవలం 31 మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా సరైన సమయానికి అగ్నిప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాల స్థాయి పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 6, 2024
HYD: అన్నింటా ఆరితేరారు.. వీరితో జాగ్రత్త..!
HYDలో సైబర్ మోసాలు, వ్యభిచార కార్యకలాపాలు, నకిలీ యాప్స్, డ్రగ్స్ రవాణా వంటి అనేక కేసుల్లో విదేశీయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గత మూడేళ్లలో డ్రగ్స్ సరఫరా కేసుల్లో దాదాపు 31 మంది ఉండటం గమనార్హం. ఇందులో 90% నైజీరియన్లే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. నకిలీ కార్డులను తయారీలోనూ విదేశీయులు ఆరితేరారు. సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా దేశాల కేంద్రంగా సైబర్ మోసాలూ జరుగుతున్నాయి.
News December 6, 2024
RR: విద్యార్థుల ఇంటికి హెడ్ మాస్టర్
విద్యాశాఖ అధికారుల చొరవతో స్కూల్ HMలు నేరుగా విద్యార్థుల ఇంటికొస్తున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మం. MEO వెంకట్ సూచనతో దాదాపూర్ GOVT స్కూల్ HM కృష్ణయ్య, ఉపాధ్యాయులు వెంకటయ్య, యాదగిరి, రాజేశ్ గురువారం రాత్రి విద్యార్థుల ఇంటికెళ్లారు. పిల్లలు చదువుతున్నారా? లేదా? అని ఆరా తీశారు. హోంవర్క్‌ను పరిశీలించి, పేరెంట్స్ శ్రద్ధ చూపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల HMలు ఇలా చొరవ తీసుకుంటే ఎలా ఉంటుంది? మీ కామెంట్?
News December 6, 2024
BREAKING: ఉస్మానియాకు BRS MLA పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఆయన నివాసం నుంచి ఉదయం పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ PSకు తరలించిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన్ని స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నారు.