News April 1, 2024
HYD: లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ వాసి పి.నరేందర్(42) మెడికల్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేసి మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు లాడ్జిలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం పురుగు మందు తాగి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 17, 2025
రంగారెడ్డి : హైదరాబాద్‌లో తగ్గిన వాయు కాలుష్యం
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
News January 17, 2025
బీసీ మేధావుల సదస్సులో రాజ్యసభ ఎంపీ
కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో శుక్రవారం బీసీ మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. మండలి ప్రతిపక్షనేత సీ.మధుసూదనాచారి, ఆల్ ఇండియా ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, అఖిలపక్ష ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కులసంఘాల సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.
News January 17, 2025
HYD: చేవెళ్లలో త్వరలో ఉపఎన్నిక: కేటీఆర్
చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.