News August 20, 2024
HYD: లాయర్ సంతోష్‌పై చట్టప్రకారమే వ్యవహరించారు: సీపీ

బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.
Similar News
News February 23, 2026
RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్‌స్టార్’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.
News February 23, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు 200 కేంద్రాలు..!

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 200 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ తెలిపారు. 84,301 మంది ప్రథమ సంవత్సరం, 70,171 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


