News May 24, 2024
HYD: లింక్ క్లిక్ చేశాడు.. రూ.5.60 లక్షలు స్వాహా

స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.5.60 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారి.. స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చేలా పెట్టుబడి పెట్టిస్తామని ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన చూశాడు. లింక్పై క్లిక్ చేయగా ఓ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయ్యాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టగా..లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.5.60 లక్షలు పెట్టి మోసపోయి CCSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News October 25, 2025
రాజేంద్రనగర్: అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఉప కులపతి అల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రభుత్వం PJTAUకి 3 నూతన వ్యవసాయ కళాశాలలని మంజూరు చేసిందని హుజూర్నగర్ కళాశాలలో 30 సీట్లు, కొడంగల్లో రానున్న కళాశాలలో 30 సీట్లు, నిజామాబాద్ కళాశాలలో 30 సీట్లు అందుబాటులోకి రానున్నాయని జానయ్య వివరించారు.
News October 24, 2025
ఓయూ MBA పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
హైదరాబాద్ వాతావరణ సమాచారం

నగరంలో ఈ సాయంత్రం ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఉదయం వేళ పొగమంచు ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 27°C, కనిష్ఠం 22°C గా ఉంటుందని ఉంటుందని పేర్కొంది.


