News June 14, 2024
HYD: లెటర్స్ ఇచ్చిన సీఎం.. పోస్టింగ్ ఇవ్వలేదు: అభ్యర్థులు

HYD ప్రజాభవన్ ఇన్ఛార్జ్ సంగీతతో పాటు చిన్నారెడ్డికి ఈరోజు గురుకుల అపాయింట్మెంట్ లెటర్స్ పొందిన అభ్యర్థులు వినతి పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తాము అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నామని, ఇప్పటివరకు తమకు పోస్టింగ్ ఇవ్వలేదని వాపోయారు.అనంతరం నాంపల్లిలోని ట్రెబ్ ఛైర్మన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం చేయాలని కోరారు.
Similar News
News December 24, 2025
HYD: ఈ నంబర్లకు కాల్ చేయండి!

జలమండలి పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లపై అధికారులు మళ్లీ కొరడా ఝళిపిస్తున్నారు. HMWSSB విజిలెన్స్ బృందం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అక్రమ కనెక్షన్ ఉన్నట్లు తెలిస్తే వెంటనే ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం 9989998100, 9989987135 నంబర్లకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News December 24, 2025
HYD: అందెశ్రీ సమాధికి ఏంటీ గతి?

రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియల వేళ ఇచ్చిన ప్రభుత్వ హామీలు నీటి మూటలయ్యాయి. ఆయన మరణించినప్పుడు స్వయంగా పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ‘స్మృతివనం’నిర్మిస్తామని ప్రకటించారు. కానీ నేడు ఘాట్కేసర్లోని ఆయన సమాధి కనీసం గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిస్తోంది. “జయ జయహే తెలంగాణ” అంటూ జాతిని మేల్కొల్పిన కవికి దక్కుతున్న గౌరవం ఇదేనా అని సాహితీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 24, 2025
HYD: హద్దు మీరితే “హ్యాపీ” న్యూ ఇయర్ కాదు: సీపీ సజ్జనర్

నూతన సంవత్సరం వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని HYD పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నేటి నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో క్రిస్మస్, న్యూ ఇయర్ బందోబస్తుపై క్షేత్రస్థాయి అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


