News December 24, 2024
HYD: లేఖ పేరుతో BRS కపట ప్రేమ: మంత్రి
గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు పర్చకుండా, రైతుబంధు పేరిట రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికీ రైతుబంధు ఇద్దామంటే బీఆర్ఎస్ నాయకులు నాటకాలకు తెరతీస్తున్నారన్నారు. మాయ మాటలతో మరోసారి రైతాంగాన్ని ఆందోళనలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్లో 35% కేటాయించమన్నారు.
Similar News
News February 5, 2025
త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్
గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 5, 2025
హైదరాబాద్‌లో ఎవరి బలం ఎంత?
HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.