News March 19, 2024

HYD: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్, AROలు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో పారదర్శకంగా, జవాబుదారీగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఉద్ఘాటించారు.

Similar News

News December 20, 2025

టీ20 ప్రపంచకప్‌ జట్టులో మన హైదరాబాదీ

image

భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌నకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. పొట్టి ఫార్మాట్‌లో 68 సగటుతో కోహ్లీ రికార్డును దాటేసిన తిలక్ ఎంపికపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.

News December 20, 2025

HYD: 600 స్పెషల్ ట్రైన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం

image

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదని బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే.. సంక్రాంతి సందర్భంగా మొత్తం 600 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్నామన్నారు. ఇప్పటికే 124 రైళ్లు సేవలందిస్తున్నాయని తెలిపారు. మరింకెందుకు ఆలస్యం బుక్ చేసుకోండి మరి.

News December 20, 2025

HYD: డివిజన్ల పేర్ల మార్పుపై సెంటిమెంట్‌కే పెద్దపీట

image

పునర్విభజనలో భాగంగా అధికారులు కొన్ని డివిజన్ల పేర్లను మార్చారు. మరి కొన్ని డివిజన్లు అసలు లేనేలేవు. దీంతో వేలమంది తమ డివిజన్ పేరు మారిస్తే ఎలా? పేరు లేకపోతే ఎలా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన కౌన్సిల్  సమావేశంలోనూ సభ్యులు ఈ విషయం లేవనెత్తారు. దీంతో ప్రజల సెంటిమెంటును గౌరవించి పాతపేర్లనే కొనసాగించనున్నట్లు తెలిసింది.