News March 22, 2025

HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

image

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 24, 2025

హైదరాబాద్ వాతావరణ సమాచారం

image

నగరంలో ఈ సాయంత్రం ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఉదయం వేళ పొగమంచు ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 27°C, కనిష్ఠం 22°C గా ఉంటుందని ఉంటుందని పేర్కొంది.

News October 24, 2025

ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.

News October 24, 2025

ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.