News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Similar News
News April 18, 2025
సిట్ విచారణకు విజయసాయి హాజరు

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి కిందటే విజయవాడలోని సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్‌కు కసిరెడ్డి రాజశేఖరే కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారించేందుకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.
News April 18, 2025
విక్రమ్ ‘వీర ధీర శూర’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుందని తెలిపింది. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో విడుదలైంది.
News April 18, 2025
భీమవరం: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి గల వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు వారి దరఖాస్తులను 85000 64372కు అందజేయాలన్నారు.