News July 21, 2024
HYD: వరద నివారణ చర్యల్లో యంత్రాంగం
అధికార యంత్రాంగమంతా వరద నివారణ చర్యల్లో ఉందని, 24 గంటలు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు కూలడం తదితర ఇబ్బందులపై ఆమె అధికారులతో మాట్లాడారు. జోనల్ సర్కిల్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తరచుగా నీరు నిలిచే ప్రాంతాల్లో 238 స్టాటిక్ బృందాలు రోజంతా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజుజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ లలితా దేవిగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలు పటిస్తున్నారు. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News October 7, 2024
HYD: ఏపీ సీఎం CBNను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభలేఖను అందజేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.
News October 7, 2024
HYD: మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనా?: కేటీఆర్
సోషల్ మీడియాలో ఎల్లప్పడూ యాక్టివ్‌గా ఉంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు MLA KTR. నిత్యం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ట్వీట్‌లు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ బడ్జెట్‌పై X వేదికగా తాజాగా స్పందించారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి అంటూ రాసుకొచ్చారు.