News November 28, 2024

HYD: వర్ణ వివక్షతపై ఫులే అలుపెరగని పోరాటం చేశారు: KTR

image

మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆ మహానీయుడి చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్ణ వివక్షతను రూపుమాపడం కోసం, దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫులే కార్యాచరణ మహోన్నతమైనదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Similar News

News February 23, 2026

గ్రేటర్‌లో కొత్త వెలుగుల జిలుగులు

image

మూడు ముక్కలైన గ్రేటర్ పాలనలో ఇప్పుడు కొత్త కాంతులు నిండనున్నాయి. EESL తప్పుకోవడంతో వీధి దీపాల నిర్వహణ భారమైనా ప్రభుత్వం పట్టు వదలకుండా CYB, మల్కాజిగిరి, GHMC పరిధిలో ఒకే తరహా వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కానుంది. ఇకపై నగరం మొత్తం ఒకే రకమైన ప్రకటనల పాలసీ అమల్లోకి రానుంది. డిజిటల్ వెలుగులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.

News February 23, 2026

మురికి కూపంలో జవహర్‌నగర్.. డంపింగ్ యార్డు వేట!

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్‌నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.

News February 23, 2026

HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

image

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREE‌గా హెల్మెట్‌ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.