News September 30, 2024

HYD: వర్సిటీగా మారనున్న SBTET సాంకేతిక మండలి!

image

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం VKB జిల్లా కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మార్చారు. తాజా మంత్రివర్గ సమావేశంలో మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కూడా మార్చాలని నిర్ణయించింది. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రస్తుతం SBTET సాంకేతిక మండలి పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డుకు ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలేషన్ ఇవ్వడానికి వీలు ఉండదని భవిష్యత్తులో వర్సిటీగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది.

Similar News

News October 12, 2024

HYD: నేడు జన్వాడకు సింగర్ మంగ్లీ, జానులైరి

image

శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వేడుకలకు సింగర్ మంగ్లి, ఫోక్ డాన్సర్ జానులైరితో పాటు మరికొందరు కళాకారులు సందడి చేయనున్నట్లు బీజేపీ నాయకుడు గౌడిచర్ల వెంకటేశ్ యాదవ్ తెలిపారు. ఏటా బోనాలకు ఆహ్వానించే స్పెషల్ గెస్టులను ఈ సారి దసరాకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News October 12, 2024

HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట

image

GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.

News October 12, 2024

HYD: బంగారు మైసమ్మ సన్నిధిలో CP సీవీ ఆనంద్

image

దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పార్శీగుట్ట, మధురానగర్ కాలనీ బంగారు మైసమ్మను హైదరాబాద్ CP సీవీ ఆనంద్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీపీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి ప్రసాదం అందచేశారు. సీపీ నగర ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.