News November 12, 2024

HYD: వానరానికీ శివుడే దేవుడు!

image

కార్తీకమాస సోమవారం కీసరగుట్టలో ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది.‌ శిరసా నమామి అంటూ ఓ వానరం శివయ్యను హత్తుకుంది. కీసరగుట్టలోని శివలింగానికి భక్తులు పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వానరాలు శివలింగం చుట్టూ ఆటలాడాయి. నైవేద్యంగా పెట్టిన అరటి పండు తిన్న ఓ వానరం ఆకలి తీర్చావయ్యా అని అనుకుందేమో..! నువ్వే నాకు దిక్కు అంటూ లింగాన్ని నమస్కరించింది.

Similar News

News September 17, 2025

HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

image

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.

News September 17, 2025

హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

image

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్‌ పోలో‌తో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.

News September 17, 2025

HYD: సాయుధ పోరాటంలో డియర్ కామ్రేడ్స్

image

తెలంగాణ సాయుధ పోరాటం.. HYD సంస్థానంలో విప్లవం రగిల్చిన మహోత్తర ఘట్టం. ప్రాణాలు పోతోన్నా రజాకార్లకు ఎదురొడ్డిన వీర గాథలు కోకొల్లలు. ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ నినాదంతో మక్దూం మోహియుద్దీన్ కామ్రేడ్‌లను ఏకం చేస్తే, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటంలో రాజ బహదూర్ గౌ‌ర్‌ కీలకంగా వ్యవహరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ప్రజలను నిత్యం చైతన్యం వైపు నడిపించిన కామ్రేడ్స్ SEP 17న అందరి గుండెల్లో నిలిచారు.