News May 10, 2024

HYD: వారి ఓటును వారికి వేసుకోలేరు!

image

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు వారికి వేసుకోలేరు. HYD MP అసదుద్దీన్ ఓవైసీ నివాసం చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజేంద్రనగర్. ఇక్కడ MIM పోటీలో లేదు. దీంతో వేరే పార్టీకి ఓటు వేయక తప్పదు. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నివాసం మల్కాజిగిరి పార్లమెంట్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్. HYD కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ సమీర్ నివాసం SEC పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలి.

Similar News

News October 28, 2025

జూబ్లీ బైపోల్: మంత్రులకు బాధ్యతలు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్‌రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు.

News October 28, 2025

శంకర్ మఠాన్ని సందర్శించిన రాంచందర్‌రావు

image

HYDలోని నల్లకుంట శృంగేరి శంకర్ మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించారు. శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకొని, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

News October 28, 2025

HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

image

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.