News May 10, 2024
HYD: వారి ఓటును వారికి వేసుకోలేరు!

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి ఓటు వారికి వేసుకోలేరు. HYD MP అసదుద్దీన్ ఓవైసీ నివాసం చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజేంద్రనగర్. ఇక్కడ MIM పోటీలో లేదు. దీంతో వేరే పార్టీకి ఓటు వేయక తప్పదు. HYD బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నివాసం మల్కాజిగిరి పార్లమెంట్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్. HYD కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ సమీర్ నివాసం SEC పార్లమెంట్ పరిధి జూబ్లీహిల్స్లో ఓటు వేయాలి.
Similar News
News November 1, 2025
HYD: నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇలా..

బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నేడు రాత్రి 7 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. బోరబండ బస్టాప్ నుంచి విజేత థియేటర్, మోతీ నగర్ ఎక్స్ రోడ్, డాన్ బాస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగనుంది. బోరబండ బస్టాప్ వద్ద పబ్లిక్ మీటింగ్, జనప్రియ బ్యాక్ గేట్ శంకర్ లాల్ నగర్ వద్ద మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
News November 1, 2025
HYD: ప్రముఖులను అందించిన నిజాం కాలేజీ

HYD బషీర్బాగ్లోని నిజాం కాలేజీకి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కాలేజీలోనే మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, KTR, నాదెండ్ల మనోహర్, ప్రొ.కోదండరాం, అసదుద్దీన్ ఒవైసీ, బాలకృష్ణ, అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ, IPS అధికారులు CVఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సహా పలువురు ప్రముఖులు చదివారు. శుక్రవారం TG మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజహరుద్దీన్ కూడా నిజాం కాలేజీ పూర్వ విద్యార్థే.
News October 31, 2025
HYD: ఉక్కు మనిషి వల్లే ఊపిరి పీల్చాం!

భారత ఏకత్వానికి ప్రతీకగా నిలిచారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. 565 సంస్థానాలను ఒకే త్రివర్ణ పతాకం కింద సమీకరించిన మహనీయుడు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడంలో ఆయన చూపిన ధైర్యం చరిత్రలో చెరిగిపోదు. ఆపరేషన్ పోలో ద్వారా నిజాంపాలనకు తెరదించారు. ఉక్కు మనిషి ఉక్కు సంకల్పం వల్లే ఊపిరి పీల్చామనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరేమంటారు?


