News August 13, 2024

HYD: ‘వాహనం ఎంతకు కొన్నా పూర్తి ట్యాక్స్ కట్టాలి’

image

వాహన కొనుగోలులో షోరూమ్‌లు ఇచ్చిన డిస్కౌంట్‌కు కూడా పన్ను చెల్లించాల్సిందేనని, పూర్తి ట్యాక్స్‌ కడితేనే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాహన ధర ఆర్టీఏ డేటాబేస్‌లో ఉంటుందని, డిస్కౌంట్‌ అనేది పన్ను మినహాయింపునకు కాదని కస్టమర్లు గుర్తించాలని సూచించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Similar News

News November 18, 2025

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: సీఎం

image

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా అప్పటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ని కోరుతున్నామన్నారు.

హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..!

image

హైదరాబాద్‌ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మారెడ్‌పల్లి మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 13.1℃గా నమోదైంది. అటు హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, చార్మినార్, బండ్లగూడ, బహదర్‌పురా, అసిఫ్‌నగర్ 13.9, గోల్కొండ 14.6, తిరుమలగిరి 15.2, ఖైరతాబాద్ 15.3, షేక్‌పేట్ 16.1, సికింద్రాబాద్ మండలంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2℃గా నమోదైంది.