News October 14, 2024
HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల

సికింద్రాబాద్‌లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Similar News
News February 26, 2026
HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.
News February 26, 2026
HYD: తల్లి మరణించినా ఎగ్జామ్‌కు హాజరు

HYD శివారు శంకర్‌పల్లిలో హృదయాన్ని కదిలించిందీ ఘటన. కేజీబీవీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కల్పన (40) మంగళవారం రాత్రి మరణించారు. బుధవారమే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో, ఆమె కుమారుడు రవితేజ మాత్రం పరీక్షకు వెళ్లాలనుకున్నాడు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా.. పరీక్ష పూర్తి చేసి అనంతరం తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు.
News February 26, 2026
చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.


