News December 10, 2024
HYD: విజయవంతంగా ప్రజా విజయోత్సవాలు పూర్తి: సీఎస్
ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 13, 2025
HYD: మిసెస్ ఇండియా తెలంగాణగా మిథాలీ అగర్వాల్
హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్‌లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.
News January 13, 2025
HYD: రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సుల రయ్ రయ్..!
హైదరాబాద్‌లోని ఉప్పల్, KPHB, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, JBS, MGBS నుంచి హనుమకొండ, వరంగల్, తొర్రూరు, కరీంనగర్, సిద్దిపేట వెళ్లే రోడ్డు మార్గంలో RTC ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ మంటూ.. తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో 3,200 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం క్రితమే నూతన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు.
News January 13, 2025
HYD: పండ్లు, కూరగాయలు కొంటున్నారా..ఇలా చేయండి!
హైదరాబాద్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి, తినే వారికి GHMC, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు సూచనలు చేశారు. శుభ్రమైన నీటితో మొదట కడగాలన్నారు. కడగటానికి ఉపయోగించే నీటిలో ఏవైనా విష పదార్థాలు ఉంటే, మనం తినే ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. తద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరగటం, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందన్నారు. నీటిలో కాస్తంత ఉప్పు వేసి, కడిగితే మరింత మేలని సూచించారు.