News July 16, 2024

HYD: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. డాన్స్ మాస్టర్‌పై కేసు నమోదు

image

స్కూల్ డాన్స్ మాస్టర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. HYD బోడుప్పల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునే ఒకటో తరగతి విద్యార్థినితో డాన్స్ మాస్టర్ సారా <<13637337>>రవికుమార్<<>> (33) అసభ్యంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News September 15, 2025

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

image

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 15, 2025

HYD: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

image

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలపై ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది. అనంతరం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిల్లో రూ.140 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 15, 2025

HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్‌లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.